![]() |
![]() |
.webp)
సంజన గల్రాని బిగ్ బాస్ సీజన్ 9 దుమ్ము దులిపిన కంటెస్టెంట్. ఒకప్పుడు ప్రభాస్ హీరోయిన్ గ గుర్తింపు తెచ్చుకుంటే ఇప్పుడు బిగ్ బాస్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాంటి సంజన ఈ మధ్య ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోకి వస్తోంది. అలాగే ఒక తెలుగు సీరియల్ "ఏ దేవి వరము నీవో "లో నటిస్తోంది. రీసెంట్ గా కిస్సిక్ టాక్స్ షోకి వచ్చింది. "మీ బాబు ఎలా ఉన్నాడు" అని వర్ష అడిగేసరికి "ఇమ్మానుయేల్ ఆ అలారికా " అని అడిగింది సంజన. "ఇమ్మానుయేల్ ఎప్పుడూ సక్సెస్ అయ్యాడు.
నా స్ట్రాంగ్ ఫీలింగ్ ఏంటంటే ఇమ్మానుయేల్ కి ఒక సూపర్ హిట్ పడుతుందేమో ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీలో బ్రహ్మానందం గారి ప్లేస్ లో వెళ్ళిపోతాడేమో" అనిపిస్తోంది అని చెప్పింది సంజన. "ఈరోజు సంజన నవ్వుతున్నారు కానీ జైలుకు కూడా వెళ్లొచ్చారు" అని వర్ష అడిగేసరికి "నన్ను బలిపశువును చేశారు. వరస్ట్ కాంట్రావర్సీలో దింపారు నన్ను. అది నిజంగా చావుతో సమానం. శత్రువుకి కూడా అలా కాకూడదు. చావు అంచుల వరకు వెళ్లి బయటపడ్డాను. మందు, డ్రగ్స్ అని నన్ను బయటకు లాగారు. నేను బిగ్ బాస్ హౌస్ లో మూడున్నర నెలలు ఉన్నాను.
నాకేం అడిక్షన్స్ ఉన్నాయి. బిగ్ బాస్ హౌస్ కి వెళ్లేముందు అందరూ తిట్టారు. మా ఆయన కూడా తిట్టాడు. పాప పుట్టి ఐదు నెలలు కూడా కాలేదు. నా మీద వచ్చిన నిందను పోగొట్టుకోవడానికి వెళ్తున్నా అని చెప్పినా ఎవరూ అర్ధం చేసుకోలేదు. నా బిడ్డ తన అమ్మతో ఇలా జరిగిందని చెప్పకూడదు. ఒక తల్లిగా బ్రతికాం. " అని చెప్పింది. దాంతో వర్షకు కన్నీళ్లు వచ్చేసాయి.
![]() |
![]() |